calender_icon.png 18 August, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

18-08-2025 12:00:00 AM

సెట్విన్ మాజీ చైర్మన్, ఐఎల్ డబ్ల్యూ ఎఫ్ అధ్యక్షుడు మీర్ ఇనాయక్ అలీ బాక్రి

ముషీరాబాద్, ఆగస్టు 17(విజయక్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్ కు 12 వేలు ఇవ్వాలని, హైదరాబాదులో  నడుస్తున్న ఇతర జిల్లాల ఆటోలను వెంటనే  నిషేధించాలని సెట్విన్ మాజీ చైర్మన్, ఇన్ఫార్మర్ లేబరర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్య క్షుడు మీర్ ఇనాయత్ అలీ బాక్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆది వారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఇనాయత్ అలీ బాక్రి  మాట్లాడు తూ హైదరాబాద్ నగరంలో రెండు లక్షల ఆటోలు పర్మిట్ ఉంటే, ఇతర జిల్లాలకు చెందిన నాలుగు లక్షల ఆటోలు నడుస్తున్నాయని, వీటిని వెంటనే హైదరాబాద్ నగరం లో తిరగకుండా నిషేధించాలన్నారు. అదే విధంగా మీటర్ రేట్లు, చార్జీలు పెంచాలన్నా రు. రాపిడో, ఓలా, ఉబర్ బైక్ లను వెంటనే నిషేదించాలన్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు వినతిపత్రం కూడా అందజేశామని,  అయినప్పటికీ కూడా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తు న్నారని ఆయన ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయ న డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అక్రమ్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మాజీద్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, అస్రాఫ్ హుస్సేన్, జనరల్ సెక్రెటరీ షేక్ సాజిద్, జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ మోహిన్,  మహబూబ్ హుస్సేన్, దితర ఆటో డ్రైవర్లు, టాక్సీ  డ్రైవర్లు పాల్గొన్నారు.