18-08-2025 12:00:00 AM
ఎంపీ మల్లు రవికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ వినతి
ముషీరాబాద్, ఆగస్టు 17(విజయక్రాంతి): ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీల అమలును ప్రారం భించాలని కోరుతూ ఆదివారం పార్లమెంటు సభ్యులు (నాగర్ కర్నూల్) మల్లు రవిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను విన్నవించారు.
ముందుగా బొకేను అందజేసి శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని 6 గ్యా రెంటీ హామీలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తిం చి, కమిటీని ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సంక్షేమ పథకాలలో, ఇందిరమ్మ ఇండ్లలో, రాజీవ్ యువ వికాసంలలో 20 శాతం కోటా ఉద్యమకారులకు కేటాయించాలన్నారు. సంక్షేమ బోర్డును ఏ ర్పాటు చేసి రూ. 10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. సాంస్కృతిక విభాగంలో వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో ఎంపీ వెంటనే స్పం దిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మా ట్లాడతానని తెలిపినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తాడూరి గగన్ కుమార్, జానకి రెడ్డి, అనంతలక్ష్మి, జగన్ యాదవ్, ఇంద్ర కుమార్, చంద్రశేఖర్, పసుల రాజు శివకుమార్ నేత, నరసింహ, గౌస్, సిహెచ్ నర్సింగ్ రావు, వెంకటేష్, విష్ణువర్ధన్ రెడ్డి, మాణిక్యం, సురేందర్, జగన్, నరసింహ రజక, రాజు, సోమయ్య, సుధాకర్, ఆంజనేయులు, ముస్త ఫా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.