calender_icon.png 27 July, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

24-07-2025 11:57:36 PM

తెలంగాణ యువజన సంఘం డిమాండ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధుబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్(Basheer Bagh Press Club)లో అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి సుమారు 18 నెలలు కావస్తున్న నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుందని తెలిపారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగ యువత కుంగుపాటుకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన ప్రకటనలు వద్దని, ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఫ్రీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేసి, తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మారేపల్లి కుమార్, నాయకులు సునీల్, రహమత్ భాష, సంతోష్ రెడ్డి, విప్లవ కుమార్, తదితరులు పాల్గొన్నారు.