calender_icon.png 27 July, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ 44.10 కోట్లు ఇవ్వండి

25-07-2025 12:00:00 AM

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల జూలై 24 : జడ్చర్ల నియోజకవర్గంలోని 9 ప్రాంతాలలో వంతెనను నిర్మించేందుకు రూ 44.10 కోట్లు మం జూరు చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్కను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కలిసి ని ధులు మంజూరు చేయాలని కోరారు.

జ డ్చర్ల మండలం లింగంపేట నుంచి నల్లకుంట తాండకు వెళ్లే మార్గంలో వంతెన ని ర్మాణానికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి నుంచి లింగంధన మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, నెక్కొండ నుంచి బైరంపల్లి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, కొండేడు నుంచి తుపడగడ్డ తాండా మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, బాలానగర్ మండలంలో జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతీఘనపూర్, సూరారం మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, శేరిగూడ నుంచి బోడజానంపేట్ కు వెళ్లే రోడ్డులో వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని చెప్పారు.

నవాబ్పేట మండలంలో వీరశెట్పల్లి నుంచి దయపంతులపల్లి మీదుగా హాజీపూర్ మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.2.40 కోట్లు ప్రతిపాదించామన్నారు. రాజాపూర్ మండలంలో రాయపల్లి నుంచి కుచ్చర్కల్ వెళ్లే రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు, మిడ్జిల్ మం డలంలో వల్లభరావుపల్లి నుంచి చౌటకుంటతాండా మీదుగా వేముల వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.10.20 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది వంతెనల కోసం రూ.44.10 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని అనిరుధ్ రెడ్డి తెలిపారు. నిధులు వెంటనే మంజీర అవుతాయని పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.