calender_icon.png 22 May, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ ఆల్ టైం రికార్డు

12-04-2025 12:00:00 AM

  1. చరిత్రలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు
  2. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2 వేల కోట్లు రాబడి
  3. అధికారులు, సిబ్బందికి కమిషనర్ ఇలంబర్తి అభినందన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రికార్డ్ స్థాయి లో వసూళ్లతో చరిత్ర సృష్టించిందని కమిషనర్ ఇలంబర్తి అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డ్ స్థాయిలో ఆస్తి పన్ను రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు అయినట్టు వెల్లడించారు.

అందుకు కృషి చేసిన రెవెన్యూ అధికారులు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, ఏఎంసీలు, డిప్యూటీ కమిషనర్లను అభినందిస్తూ శుక్రవారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో పన్నులు వసూలు కావడం హర్షణీయమన్నారు.

పన్ను వసూలు ఎంత ఎక్కువగా ఉం టూ ప్రజలకు అంత బాగా సేవలందించే వీలుంటుందని పేర్కొన్నారు. ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం అమలుతో మంచి ఫలితాలు వచ్చా యని ఇలంబర్తి అన్నారు. గత  ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 121 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైందన్నారు. అత్యధికంగా పన్ను వసూలు చేసిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు.