14-05-2025 08:13:06 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డివిజన్లో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సత్వరం చర్యలు తీసుకుంటున్నట్టు ఆపరేషన్ డిఇ నాగరాజు(DE Nagaraju) తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీతో పాటు ఆయా గ్రామాల్లో విద్యుత్ కు సంబంధించిన సమస్య ఉన్న వెంటనే తమ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఆ సమస్యను 24 గంటల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వాట్సాప్ గ్రూప్ లో సమస్యలను షేర్ చేసిన వాటికి తక్షణ పరిష్కారం ఉంటుందన్నారు, తమ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడం జరిగిందని తెలిపారు.
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గురువారం విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్-స్టేషన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న 33 కెవి విద్యుత్ టవర్ పనుల దృష్ట్యా ఉదయం 08:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఆదర్శనగర్, రామ్ నగర్, గాయత్రీపురం, ఆశ్ర కాలనీ, ఈద్గామ్, గోల్డెన్ ఫంక్షన్ హాల్, భాగ్యనగర్, ఫిష్ మార్కెట్, సిద్ధాపూర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది, కావున వినియోగదారులు సహకరించగలరు.