14-05-2025 08:05:12 PM
ఇచ్చోడ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు ఐడి కార్డుల నమోదు కార్యక్రమాన్ని బుధవారం మండలంలోని ముక్రా(బి) గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ అధికారులు గ్రామంలోని రైతులకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న ప్రతి రైతు కార్డులో పేరు నమోదు చేయించుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు రైతులకు అందుతాయిఅని ప్రతి రైతు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ మారుతితో పాటు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.