02-08-2025 01:42:21 PM
అయిజ: ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ను కోరారు. శనివారం స్థానిక నాయకులతో కలిసి ఆయన తాసిల్దార్ జ్యోతి కి వినతి పత్రం ను అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ భూమికి సంబంధించిన 936 సర్వే నెంబర్ లో పోలీస్ స్టేషన్ కు ఎదురుగా బుడగ జంగాల కాలనీలో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఒక వ్యక్తి కబ్జా చేసుకున్నాడని, వ్యవసాయం చేసుకోవడానికి గత 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆ భూమిని ఇచ్చిందని ఆ భూమిలో సాగు చేయకపోవడంతో కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆ వ్యక్తి పేరున ఉన్న భూమిని రద్దు చేసిందన్నారు. కబ్జాదారుడు కోర్టుకు వెళ్లి నాకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని అన్యాయంగా లాక్కున్నారని , తిరిగి ఇప్పించండి అని కోర్టును ఆశ్రయించాడం జరిగిందన్నారు. బుడగ జంగాల కాలనీ భారీ వర్షాలకు మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో. కబ్జాదారుడు ఆ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు . ఈ కార్యక్రమంలో బి.నాగరాజు, వెంకటేష్ యాదవ్, వీరయ్య చారి, కే.రాజశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.