02-08-2025 01:45:07 PM
యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఉమ్మడి ఇంచార్జ్ఏరుకొండ రామ్ కోటి ప్రజాపతి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి):బీసీల రిజర్వేషన్ కోసం తెలంగాణ జాగృతి(Telangana Jagruti) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల మహా నిరాహార దీక్షలో ప్రతి ఒక్క బీసీ పాల్గొనాలని యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఉమ్మడి ఇంచార్జ్ఏరుకొండ రామ్ కోటి ప్రజాపతి, నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచమళ్ళ బాలకృష్ణ పిలుపునిచ్చారు.యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి సంయుక్తంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నారని పేర్కొన్నారు.కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ చేసిన పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో బీసీల కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని గుర్తుచేశారు. 'గతంలో కాంగ్రెస్ పార్టీ దిల్లీలో నిర్వహించిన ధర్నాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీయే పట్టించుకోలేదన్నారు. ఇప్పుడూ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పకుండా పార్టీపరంగా ధర్నా చేస్తామని చెప్పడం బీసీలను వంచించడమే. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే, రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నిరాహార దీక్ష వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఎరుకల సంఘం వెలుగు శంకర్, దళిత సంఘం రాములు, యాదవ సంఘం దోటి గణేష్,పగిళ్ల భాస్కర్,విశ్వకర్మ సంఘం శ్రీనివాస చారి,నరేష్,కుమ్మర సంఘం జిల్లా నాయకులు నగేష్, సంధ్యారాణి, మంజుల,తదితరులు పాల్గొన్నారు.