calender_icon.png 11 October, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధాలు, మోసాలకు కేరాఫ్ కాంగ్రెస్

11-10-2025 01:31:52 AM

  1. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు

హైడ్రా లింక్‌తో జూబ్లీ హిల్స్ పోటీకి ఎం ఐ ఎం దూరం

ఎవరితో కలవాల్సిన అవసరం బిజెపికి లేదు

బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నామాజీ

నారాయణపేట. అక్టోబర్, 10(విజయక్రాంతి) :అబద్ధాలు,మోసాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ అని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నా మాజీ కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు.శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

బిజెపి రాష్ట్ర నాయకులు కే. రతంగ్ పాండు రెడ్డి,జిల్లా బిజెపి అద్యక్షుడు సత్య యాదవ్, కోశాధికారి సిద్ది వెంకట్ రాములు,మీడియా ఇంఛార్జి కిరణ్ దగే,జే ఏ సీ వెంకటయ్య తో కలిసి మాట్లాడుతు ప్రజలను మోసం చేయ డం అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అని అన్నారు.ఇప్పుడు కపట ప్రేమ వలకబోస్తు 42శాతం బిసి రిజర్వేషన్ల పేరుతో బి సిలను మోసం చేసిందని అన్నారు.

బిసి రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి చిత్తశు ద్ది లేదని జి ఓ 9 నీ కోర్టు కొట్టి వేయడంతో మరోసారి మోసం బయట పడిందని అన్నా రు. నిజంగా బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ది ఉంటే పకడ్బందీగా ప్రకటించాలదిందని అన్నారు.అసెంబ్లీ తీర్మా నం చేసి గవర్నర్ కు పంపిన బిల్లుపై గడువు ముగియకుండా గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూడకుండా 42 శాతం బిసి రిజర్వేషన్లను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

ఎలాగో ఎవరైనా కోర్టుకు వెళతారు జి ఓ ను కోర్టు కొట్టివేస్తే నెపాన్ని ఇతరులపై నెట్టాలనే కాంగ్రెస్ కుట్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సి ఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మీసాలతో పదవిని కాపాడుకుంటున్నారు అని విమర్శించారు.బిసిల పట్ల ఎలాంటి చిత్తశుద్ది లే దని అన్నారు.బిజెపి 42 శాతం రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని అన్నారు.

కేవలం కోర్టు కొట్టి వేయడంతో కాంగ్రెస్ బండారం బయట పడడంతో నెపాన్ని బిజెపి,బి ఆర్ ఎస్ ల పై నెడుతున్నారు అని మండిపడ్డారు.కానీ బిజెపికి ఎవరితో కలవాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బి ఆర్ ఎస్ కలిసి బిసిలను మోసం చేశాయని అన్నారు. అంతే కాకుండా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎం ఐ ఎం పోటీ చే యక పోవడంలో రెండు పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బందం ప్రజలు గుర్తస్తున్నారు అని అన్నారు.

ఎం ఐ ఎం హైడ్రా భయంతో పోటీ చేయడం లేదని విమర్శించారు.కానీ హామీ లు విధ్మరించి బిసి లను మోసం చేసిన కాం గ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో మూల్యం చె ల్లించుకోక తప్పదనీ హెచ్చరించారు.ప్రజలు కాంగ్రెస్ కుటిల రాజకీయాలను గుర్తించి బుద్ది చెప్పాలని కోరారు.