03-01-2026 12:14:18 AM
కుషాయిగూడ, జనవరి 2 (విజయక్రాంతి) : కుషాయిగూడ సంబంధిత కాలనీ లు శుభోదయ కాలనీ ఫేస్ 1,2,3, సోనియా గాంధీ నగర్ కాలనీ ఫేస్ 1,2,3, వాసవి శివ నగర్ కాలనీ, మీనాక్షి నగర్, న్యూవాసవిశివనగర్ , ఎం ఆర్ ఆర్ కాలనీ , ద్వారాక పురి కాలనీ, మధురనగర్ కాలనీ, మోడీ కాలనీ, గణేష్ నగర్ కాలనీ, వైష్ణవి ఎంక్ లెవ్, మరితి ఎన్ క్లెవ్ మరియు లక్ష్మి నర్సింహా కాలనీల వాసులకోసం బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం కుషాయిగూడ బస్ డిపో ఓస్ నర్సింహా రెడ్డి కివినతి పత్రం సమర్పించారు అనంతరం పనగట్ల చక్రపాణి గౌడ్ మాట్లాడుతూ కుషాయిగూడ అన్నీ కాలనీల ప్రజలు నిత్యం బస్ సౌకర్యం లేక అనేక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు, వృద్దులు నిత్యం బస్ కోసం రెండు కిలోమీటర్లు నడిచి కుషాయిగూడ బస్ స్టాప్ వద్దకు వెళ్లవలసి వొస్తుందన్నారు. వారి సౌకర్య ర్థం వెంటనే మూడు బస్‌లు 3k, 117, 17 బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డిపో ఓస్ గారు కూడా డిపో మేనేజర్ దృష్టికి తీసుక వెళ్లి వెంటనే ప్రజల సౌకర్యర్థం బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని వారన్నారు. కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియే షన్ జా యింట్ సెక్రటరీ నాలచెరువు జనార్దన్, మీనాక్షి నగర్ కాలనీ అధ్యక్షులు సురేష్ గుప్త, నర్సింగ్‌రావు, శుభోధయ కాలనీ మాజీ అధ్యక్షులు కాసుల నందం గౌ డ్, లక్ష్మి నర్సింహా కాలనీ ఎస్. సత్యం యా దవ్, నీరు డు బాబు, రమేష్ పాల్గొన్నారు.