02-08-2025 12:00:00 AM
దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
పటాన్ చెరు, ఆగస్టు 1 : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, పూజారులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, ఎస్బీఐ లైఫ్ తదితర ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను కోరినట్లు ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. అలాగే హిందూ దేవాలయాల్లో టికెట్ ధరల్లోనే దేవాదాయ పరిసరాల్లో ఉన్న భక్తులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు.