calender_icon.png 4 July, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

02-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

   వనపర్తి టౌన్, జూలై 1: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారికి భోజనాన్ని వడ్డించే ముందు సూపర్వైజర్లు తిని రుచి చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంట లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.పాఠశాలలోని వంటశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం మాత్రమే వడ్డించాలని సూచించారు. విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించే ముందు సూపర్వైజర్లు తినే రుచి చూడాలని సూచించారు.

నా ణ్యమైన బియ్యం సరఫరా చేయకపోతే స్టాక్ ను అనుమతించవద్దని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ గణిత శాస్త్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను అడిగి విద్యార్థుల ద్వారా సమాధానాలను రాబట్టారు.పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను ప్రశ్నించిన కలెక్టర్, స్టాక్ వచ్చినప్పుడు విద్యార్థులు కూడా చెక్ చేయాలని సూచించారు.హరిజనవాడ ప్రభుత్వ పాఠశాల సందర్శన జిల్లా కేంద్రంలోని హరిజనవాడ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు పట్టికను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయులందరూ సరైన సమయానికి వస్తున్నారా అని ఆరా తీశారు.విద్యార్థుల మార్కుల ను పరిశీలించిన కలెక్టర్,వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు అంజి, వెంకటమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించగా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. జి సి డి వో శుభలక్ష్మి, హౌసింగ్ డిఈ విఠోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.