02-07-2025 12:00:00 AM
వరంగల్ (మహబూబాబాద్), జూలై 1 (విజయ క్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి నవరాత్ర మహోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు భద్రకాళీ మాత ‘విప్రచిత్తా’, ‘మహా వజ్రేశ్వరి’ అవతారాలుగా భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు, పూజారాధనలు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి మయూరి రామేశ్వరరావు, గాండ్ల స్రవంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.