calender_icon.png 6 August, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

06-08-2025 06:06:05 PM

జిల్లా విద్యశాఖ అధికారి రాజేందర్..

చిట్యాల (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు, ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్(District Education Officer Rajender) అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల, వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల ప్రగతి, బేస్ లైన్ టెస్ట్ పరీక్ష పత్రాలు, ఉపాధ్యాయుల రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

ఉత్తమ బోధన అందించాలని, తల్లిదండ్రుల సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని సందర్శించి స్టోర్ రూమ్ లోని సరుకులను పరిశీలించారు. గదుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానన్నారు. అయన వెంట మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి, ఏఎంవో లక్ష్మణ్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రాజగోపాల్, జీసీడీవో శైలజ, గోరికొత్తపల్లి విద్యాశాఖ అధికారి రాజు, ప్రిన్సిపాల్ రమేష్, ఎమ్మార్సీ సిబ్బంది ఆకుల హరీష్, నరేష్, రాజు తదితరులు ఉన్నారు.