calender_icon.png 25 October, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించాలి

25-10-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మందమర్రి, అక్టోబర్ 24: బ్యాంక్ ఖాతాదారులకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. శుక్రవారం మండలం లోని గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నూతన కార్యాలయాన్ని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ (ఎజిఎం.) రాధాకృష్ణ, లీడ్ డిస్టిక్ మేనేజర్ తిరుపతి, శాఖ మేనేజర్ సంజీవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగ దారులకు బ్యాంకు సేవలు మరింత అందుబాటు లోకి రానున్నాయన్నారు. పొదుపు, బీమా, పెన్షన్, పెట్టుబడులు, అనేక అంశాలలో ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంక్ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.