18-12-2025 07:20:40 PM
నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా శాఖ పక్షాన నారాయణపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ను కలెక్టర్ చాంబర్లో కలిసి మొక్కను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో మూడు విడుతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
వరుసగా ఉన్న ఎన్నికల దృష్ట్యా సంఘం ప్రాతినిధ్యమును వివిధ దశలలో పాల్గొన్న ఎన్నికల సిబ్బందికి ఆన్ డ్యూటీ సౌకర్యము కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎన్నడు లేనంతగా జిల్లాలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉన్నందున పాఠశాలల పని వేళలను ఉదయము 9:30 గంటల నుండి నాలుగున్నర గంటల వరకు నిర్వహించేలా సమయపాలన మార్చాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించిన ఉపాధ్యాయులను సహకరించిన ఉపాధ్యాయ సంఘాలను అభినందించారు. అదేవిధంగా పదవ తరగతి ప్రత్యేక తరగతులను ఎనిమిది గంటలకు కాకుండా ఎనిమిదిన్నర గంటలకు నిర్వహించేలా చూడాలని కోరడం జరిగింది.వారు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు వై జనార్దన్ రెడ్డి, నారాయణపేట మండల అధ్యక్షులు ఏం రఘువీర్ ప్రధాన కార్యదర్శి ఎం జనార్ధన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.