13-08-2025 06:28:12 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం(Right to Information Act)పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి సమాచార హక్కు దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు రాష్ట్ర కమిషనర్లకు బుధవారం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ హైదర్(Syed Haider) ఆదురులో వినతిపత్రం అందించారు. నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్లు మోసిన పర్వీన్ శ్రీ భూపాల్ కు వినతి పత్రం అందించారు. నిర్మల్ జిల్లాలో తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్ జాతీయ మానవ హక్కుల సాయ సంగం నాయకులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.