13-08-2025 06:24:39 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): రైతు శ్రేయస్సు ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని బుధవారం కాటారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుమల(Market Committee Chairperson Tirumala) అన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన మొట్టమొదటి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, ఈ మార్కెట్ కమిటీ పరిధిలోని ఐదు మండలాల్లోని రైతుల అభివృద్ధి సంక్షేమానికై చేపట్టిన అంశాలను చర్చించారు. పలువురు డైరెక్టర్లు వైస్ చైర్మన్ ఇచ్చిన సూచనలు మేరకు మార్కెట్ కమిటీలో ఉన్న స్థలం కొంత కబ్జాకు గురైందని ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని సరిహద్దు గోడ నిర్మించాలని తీర్మానం చేశామన్నారు. రైతుల కొరకు పశువుల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సౌకర్యం కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకొని నిర్మించాలని అన్నారు.
రాష్ట్రంలో ఉత్తమ మార్కెట్ కమిటీని సందర్శించుట కు స్టడీ టూర్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. మార్కెట్ కమిటీ తరఫున చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేసి మార్కెట్ ఆదాయం పెరిగే విధంగా చేయాలని, రైతులకు ట్రాన్స్ఫార్మర్ రిపేర్లలో జరుగుతున్న అలసత్వాని కి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తీర్మానించారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో వ్యవసాయ మార్కెట్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, మహదేవపూర్ అగ్రికల్చర్ ఏడి శ్రీ పాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తిరుపతిరావు, శ్రీనివాస్, రమేష్, రామకృష్ణ, షరీఫ్, రాజారాం, రాజయ్య, శ్రీనివాస్ రెడ్డి, సడవళి తదితరులు పాల్గొన్నారు.