డోర్‌స్టెప్ ఎఫ్ఐఆర్ పట్ల ప్రజలు హర్షం
రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి బాధితులకు ఎఫ్ఐఆర్ అందించిన తుంగతుర్తి పోలీస్
ఫిర్యాదు స్వీకరించి బాధితుల వద్దనే కేసు నమోదు.
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల పరిధి వెలుగుపల్లి గ్రామ శివారులో కారు, ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం సంభవించి పర్శాయిపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి ద్విచక్ర వహనదారుడు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోద ఆసుపత్రి(Hyderabad Yashoda Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు, ఈరోజు వీరాస్వామి మరణించగా ఈ ఘటనకు సంబంధించి గురువారం తుగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ లో యశోద ఆసుపత్రి ఆసుపత్రి వద్ద మృతుని బందువుల నుండి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే కేసు నమోదు చేసి బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ ని అందించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి మాట్లాడుతూ ప్రమాద సంఘటనకు సంబంధించి బాధితురాలు నుండి ఫిర్యాదు స్వీకరించి బాధితురాలు వద్ద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్, బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు కార్యక్రమం బాధితులకు ఉపయోగపడుతుందని, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బాధితుల వద్ద నుండి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందజేశామని తెలిపారు. దీనితో కుటుంబ సభ్యులు, ప్రజల హర్షం వ్యక్తం చేశారు.




