20 March, 2026 | 12:48 PM

వంటగ్యాస్ కొరత లేకుండా ప్రజలకు అందించాలి

20-03-2026 11:32 AM

గ్యాస్ కొరత లేకుండా చూడాలని గ్యాస్ డీలర్ కు వినతి

సత్తుపల్లి,(విజయక్రాంతి): స్థానిక సత్తుపల్లి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో వంట గ్యాస్ కొడత లేకుండా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఐద్వా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ డీలర్ సుధాకర్ కు ప్రతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు  శీలం కరుణ మాట్లాడుతూ గ్యాస్ కొరత లేకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో 21 రోజులకు వచ్చే గ్యాస్ ఇప్పుడు 45 రోజులకు పెంచడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారు.

అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ టైం, పెళ్లిళ్లు పండగలు టైం లో గ్యాస్ ఏజెన్సీలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి నిబంధనలు తీసుకురావడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ బాధ్యులు తక్షణమే ప్రజలకు అవసరమైనటువంటి గ్యాస్ సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం డివిజన్ అధ్యక్షులు చెరుకు రత్నకుమారి, మహిళా సంఘం సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి , మహిళా సంఘం నాయకులు పుష్పవల్లి, మిట్టపల్లి నాగమణి, కృష్ణవేణి, లత లక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు