calender_icon.png 20 May, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

20-05-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 19 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వ యంతో పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, బెల్లంపల్లి ఆర్ డీ ఓ హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.