13-09-2025 03:12:54 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులుగా పుల్గం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరబాద్ నారాయణగూడలోని పీఆర్‌టీయూ భవన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీరిని ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి హాజరుకాగా ఎన్నికల అధికారులుగా పేరి వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్ వ్యవహరించారు.