22-11-2025 05:24:21 PM
సదశివనగర్ (విజయక్రాంతి): రామారెడ్డి మండల కేంద్రములోని వరి కొనుగోలు కేంద్రన్ని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ శనివారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధన్యన్ని తరలిస్తామని, సకాలంలో తూకం వేసి లారీలలో పంపడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, డైరెక్టర్ లక్ష్మాగౌడ్, సెక్రటరీ భైరయ్య, సిబ్బంది లింగమూర్తి, నవీన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోసైటీ చేర్మెన్ సదాశివారెడ్డి లారీలను వెంటనే పంపాలని DCOను అడుగగా సివిల్ సప్లయ్ డి.యమ్ కు ఫోన్ చేసి లారీలు పంపాలని కోరారు.