calender_icon.png 30 October, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యాచర్ కండిషన్ లేకుండా వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలి

30-10-2025 08:01:25 PM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ...

గంభీరావుపేట (విజయక్రాంతి): అకాల వర్షాలతో ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాతావరణం రైతులకు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచర్ కండిషన్ లేకుండా వడ్లు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్రం రెడ్డి, కోడె రమేష్ తదితరులు ఆయనతో కలిసి ఉన్నారు.

రైతులతో మాట్లాడిన అనంతరం గోపి మాట్లాడుతూ – పది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, ఇప్పటికీ కొనుగోలు ప్రారంభం కాలేదు. నిన్నటి వర్షాల కారణంగా ధాన్యం తడవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాచర్ కండిషన్ లేకుండా వడ్లు కొనుగోలు చేసి రైతులను కాపాడాలని, కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని” ఆయన అన్నారు. అదేవిధంగా, “రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెచ్చి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా వాగ్దానం చేసిన క్వింటాకు ₹500 బోనస్ ఇవ్వలేదు. అలాగే రైతులకు పాలిథిన్ కవర్లు అందించాలి. లారీలు పంపడంలో టెండర్ ప్రక్రియ ఆలస్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతులను రక్షించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్లేశ్ యాదవ్, నాయకులు గంట అశోక్, నాగరాజు గౌడ్, మహేష్ యాదవ్, డా. సత్యనారాయణ, రవీందర్, సర్వోత్తమ్, శ్రీశైలం, వాజిద్ హుస్సేన్, దేవేందర్ యాదవ్, నర్సింలు, దేవరాజు, శ్రీకాంత్, ప్రశాంత్, రాకేష్, సాయి కిరణ్, నర్మల సాయి, దేవేందర్ నాయక్, రవీందర్ నాయక్, నరేష్, రాజేష్, నవీన్, సంతోష్ చారి, శేఖర్, వెంకటేష్ రెడ్డి, గురుక మోహన్, శ్రీశైలం తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.