calender_icon.png 30 October, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ లింగాపూర్ లో ఉచిత వైద్య శిబిరం

30-10-2025 07:59:41 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): మెట్ పల్లి మండలంలోని బండలింగాపూర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు మాట్లాడుతూ మెట్ పల్లి లయన్స్ క్లబ్ తరఫున సాయి లక్ష్మి శ్రీనివాస హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం, రేకుర్తి హాస్పిటల్ సౌజన్యంతో కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఉచిత వైద్య శిబిరంలో రెండు వందల యాభై మంది పాల్గొనడం జరిగిందని వారిలో యాభై మందిని చికిత్స నిమిత్తం కంటి ఆపరేషన్ కొరకు రేకుర్తి హాస్పిటల్ కు లయన్స్ క్లబ్ సొంత ఖర్చులతో పంపించడం జరుగుతుందని తెలిపారు. 

లయన్స్ క్లబ్ పేదల సేవ చేయడం కార్యక్రమమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ వేములవాడ చంద్రశేఖర్, డాక్టర్ దుర్గంపూడి అశోక్ రెడ్డి, డాక్టర్ ప్రభాకర్, గండి హనుమాన్ ఆలయ చైర్మన్ రామానుజన్ రెడ్డి, గంగ స్వామి, జంగిడి రాజేందర్, నర్సింగరావు, దొంతుల పవన్, ఆల్ రౌండర్ గంగాధర్,  గ్రామ ప్రజలు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.