calender_icon.png 30 October, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ఎస్పి కాలువ ఆక్రమణకు గురికావడంతో గ్రామంలోకి వరద నీరు

30-10-2025 08:02:46 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలో మంగలి తండా గ్రామంలో ఉన్న ఎన్ ఎస్ పి కాలువ ఆక్రమణకు గురికావడంతో దాని నుంచి వచ్చే వరద నీరు గ్రామంలోకి చేరడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ శివారులో కొంతమంది ఎన్ఎస్పి కాలువను ఆక్రమించుకొని దానిపై కొంతమంది గునలు వేయడం తో ఈ పరిస్థితి దాపురించింద నీ గ్రామస్తులు వాపోతున్నారు. వరద నీరు ఓ వృద్ధురాలి ఇంట్లోకి చేరడంతో చేసేదేం లేక వరద నీటిలోనే స్టూల్ వేసుకొని కూర్చుంది.

అన్నం వండుకునే పరిస్థితి లేదని వాపోయింది. ఎన్ ఎస్ పి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎప్పుడు వరదలు వచ్చిన గ్రామస్తులు బిక్కుబిక్కున బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు వరద నీరు గ్రామంలోకి చేరిందని వరద నీరు వల్ల అనేక రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు.