నాణ్యమైన విద్య.. పౌష్టిక ఆహారం సర్కారు లక్ష్యం
- ముఖ్యమంత్రి ఆశయ సాధన విద్యార్థులు భాగస్వాములు కావాలి..
- చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి..
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, ఏప్రిల్23(విజయక్రాంతి): రా ష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పౌష్టిక ఆహారం ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నా రు. ప్రజా పాలన- ప్రగతి నివేదనలో భాగం గా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల్లో మంత్రి గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా వి ద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. రాష్ట్రంలో ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి యు మైనారిటీ విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయ సాధన లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. చదువులో రాణించి ఉన్నత శిఖరా లను అధిరోహించాలని మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. విద్యార్థులు వెల్లడించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనబట్ల దినేష్, ఆర్డీవో మధుసూదన్, డీసీసీ అధ్యక్షులు నందయ్య, కౌన్సిలర్లు దుమాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






