calender_icon.png 14 June, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యను అందిస్తున్న పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాల!

13-06-2025 11:04:49 PM

హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ,(విజయక్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. పింగిళి కళాశాల 2025-26 అడ్మిషన్ పోస్టర్ ను కలెక్టర్ తమ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి, మాట్లాడుతూ... పింగిళి కళాశాలలోని సైన్సు, ఆర్ట్స్, కామర్స్ మొదలైన అన్ని విభాగాలలో బోధనను అందిస్తున్న అధ్యాపకులకు అత్యధిక విద్యార్హతలు, దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవం ఉండటం వలన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారనీ, కళాశాలలో విద్యార్థినీలకు అన్ని రకాల వసతులు, అత్యాధునిక బోధన అందిస్తున్న పింగిళి కళాశాలలో విద్యార్థినిలు చేరి  తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.

కళాశాలప్రిన్సిపాల్ లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి  మాట్లాడుతూ  కళాశాలలో బి.ఏ, బి.కాం, బి.బి.ఎ, బీఎస్సీ లైఫ్ సైన్స్, బి.ఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులలో పాటు ఈ విద్యా సంవత్సరములో ప్రస్తుత కాలాని అనుగుణంగా డిగ్రీలో రెండు కొత్త కోర్సులు ప్రారంభించామన్నారు. బి.ఎస్సీలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బి.కాంలో ఈ కామర్స్ ఆపరేషన్ కోర్సులు విద్యార్థినులకు అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.జి.సుహాసిని, దోస్త్, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డా.డి. సురేశ్ బాబు, అధ్యాపకులు డా.డి.రామ కృష్ణారెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.