11-08-2025 12:59:33 AM
నగరంలో మరో వన్ హెల్త్ ఫార్మసీ బ్రాంచ్ ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): పేదలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మేడ్చల్ మల్కాజిగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డి హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నగరంలో నూతనంగా స్థాపించిన వన్ హెల్త్ ఫార్మసీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..
గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలకు అత్యుత్తమ ప్రమాణాలతో చికిత్సను, అతి తక్కువ ధరల్లో మంచి మందులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వన్ హెల్త్ ఫార్మసీ ఆ దిశగా తీసుకున్న మరో ముఖ్యమైన అడుగు తెలిపారు. ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా విస్తృత శ్రేణి ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులపై 20 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. మొదటి 100మందికి రూ. 10 వేల విలువైన ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు.
రూ. వెయ్యి పైగా కొనుగోళ్లు చేసిన వారికి ఉచితంగా మాత్రల పెట్టె అందిస్తున్నారు. మల్లారెడ్డి హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వన్ హెల్త్ ఫార్మసీ, నమ్మకమైన మందులు, ఆరోగ్య ఉత్పత్తులు, విలువైన సేవలను పోటీ ధరల్లో అందించడానికి కట్టుబడి ఉంది.
నగరంలోని బ్రాంచీలు
* దూలపల్లి: హౌ.నెం.3-130, గ్రౌండ్ ఫ్లోర్, శ్రీనివాస్‌నగర్ కాలనీ, కొంపల్లి, మేడ్చల్ -మల్కాజిగిరి
* సురారం: డి.నెం. 2-66, సురారం మెయిన్ రోడ్, కుత్బుల్లాపూర్ మండలం, మల్కాజ్‌గిరి జిల్లా
* మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి: ఓపీ 3 ఫార్మసీ, డీ.నెం.1-1-216, గ్రౌండ్ ఫ్లోర్, మెయిన్ ఎంట్రెన్స్ గేట్ పక్కన, సురారం ఎక్స్ రోడ్స్, కుత్బుల్లాపూర్
* మల్లారెడ్డి ఆసుపత్రి: బీ -బ్లాక్, సురారం ఎక్స్ రోడ్, కుత్బుల్లాపూర్
* మియాపూర్: డీ. నెం. 1-238/ఏ, షాప్ నం.7-6-2, సీ సెల్లార్, మల్లారెడ్డి కంప్లెక్స్, మియాపూర్, శేరిలింగంపల్లి.