24-08-2025 12:05:33 AM
బాచుపల్లిలోని నిషేధిత జాబితాలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్
కుత్బుల్లాపూర్, ఆగష్టు 23(విజయ క్రాంతి) : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారు. బాచుపల్లిలోని నిషేధిత జాబితాలో 83 సర్వే నెంబర్ భూమిని నిబంధ నలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ విషయం రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి చర్యలు చేపట్టారు.
కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ ను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు.కోట్లు విలువ చేసే భూమిని సబ్ రిజిస్ట్రార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ తగ్గించారాని 22ఏ లో, నిషేధిత జాబితాలో ఉన్న భూమి ని రిజిస్ట్రేషన్ చేయడంపై ఐజి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.