24-08-2025 12:05:59 AM
మండపాల వద్ద బందోబస్తు నిర్వహించాలి
మంచిర్యాల ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల,(విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంచిర్యాల ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం స్వగృహంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గంలోని గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గణేష్ చతుర్థి మొదలుకొని, నిమజ్జనం వరకు మండపాల వద్ద గస్తీ ఉండాలన్నారు. కరెంట్ కేబుల్స్ కింద ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. అగ్నిపమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.