24-08-2025 12:03:38 AM
25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు
తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ
ఖైరతాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో గౌడ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు జీవో 93ను సవరించి వైన్స్ లలో 15 శాతం ఉన్న రిజర్వేషన్లు 25శాతానికి పెంచాలని తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించింది..
ఈమేరకు శనివారం సోమజి గూడా ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తి దారుల సంఘం అధ్యక్షుడు ఐలి వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ తో పాటు రాష్ట్రంలోని వివిధ సంఘాల నాయకులు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారని జీవోల ద్వా రా అయ్యే పనులు కూడా రేవంత్ ప్రభుత్వం చేయడం లేదన్నారు. 21 నెలల కాంగ్రెస్ పాలనలో గీత కార్మికులు చాలా మంది ప్రమాదశావత్తు మరణించారని కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేద ని ధ్వజమెత్తారు. ఈసందర్భంగా ఉమ్మడి కార్యాచరను శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.
ఈనెల 25న ట్యాంక్ బండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరు గుతుందన్నారు.. ఆ తర్వాత 30న నదనం, వందకార్లతో ర్యాలీ, ఆతర్వాత ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడి, జిల్లాలల్లో గౌడ సంఘాల సభలు నిర్వహించి అనంతరం ఇందిరాపార్కు వద్ద గౌడమహా ధర్నా, తథ అనంతరం 5 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో గౌడ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణగౌడ్, అఖిలభారత గౌడ సం ఘం అధ్యక్షులు కూరెళ్ల వేములయ్యగౌడ్, అనంతరాజుగౌడ్, దామోదర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, దుర్గయ్య గౌడ్, బైరు శేఖర్, తాళ్ల శ్రీశైలంగౌడ్, గోడవెంకటేష్ గౌడ్, బబ్బూరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.