calender_icon.png 15 October, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు

15-10-2025 02:21:16 PM

హైదరాబాద్: తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతీ దేవి (97)(Raavu Balasaraswathi Devi Passes Away) కన్నుమూశారు. ఆగష్టు 29, 1928 లో జన్మించిన బాలసరస్వతి దేవి ఆరో ఏట నుంచే గాయనిగా పాటలు పాడ‌డం మొదలుపెట్టారు. ‌పాతతరం తెలుగు చలనచిత్రాల నటిగా, నేపథ్యగాయనిగా పేరు సంపాదించారు. తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం ప్రకటించారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాలసరస్వతీ దేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.