20-09-2025 08:45:25 PM
రెండోసారి డీఎన్ఏ కోసం శవాన్ని బయటకు తీసిన వైనం..
మునిపల్లి: సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన చెవుల అనుసూజ(53) అనే మహిళా 18 డిసెంబర్ 2024 నాడు అదృశ్యం కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అసలు విషయం బయటక తీసిన విషయం తెలిసిందే. ఆమె వద్ద ఉన్న మొబైల ఫోన్ కాల్ లీస్ట్ ఆధారంగా మునిపల్లి గ్రామానికి చెందిన బస్వరాజ్ అనే వ్యక్తి అనుసూజను హత్య చేసినట్లు తేలడంతో విచారించగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో గల ఏడుపాలక సమీపంలో హత్య చేయడంతో కేసు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే తల్లీ కొడుకు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎన్ ఏ టెస్ట్ కోసం శనివారం నాడు మునిపల్లిలోని స్మశాన వాటికలో ఉన్న అనుసూజ సమాధిని సదాశివపేట సీఐ వెంకటేశం, ఎమ్మార్వో గంగాభవాని, ఎస్ఐ రాజేష్ నాయక్ సమక్షంలో తవ్వి కాలి బొక్కను డాక్టర్లు తీసుకెళ్లారు.