calender_icon.png 16 August, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాగింగ్‌ను అరికట్టాలి

21-06-2024 12:00:00 AM

ఆధునిక సమాజంలో  రోజురోజుకు విచ్చలవిడితనం పెరిగి ర్యాగింగ్ సైతం పెరిగిపోతోంది. స్కూళ్లు , కాలేజిల్లో  చాలా మంది ఇంటర్నెట్ మోజులో  పడి అమాయక విద్యార్థులను వేధిస్తున్నారు. దీంతో  వారు అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు కాలేజి యాజమాన్యానికి తెలపలేక తీవ్ర ఒత్తిడితో చివరికి ప్రాణాలు తీసుకొంటున్నారు. ర్యాగింగ్ అనేది విదేశాల్లో ఎక్కువగా ఉంది. మన దేశంలో కూడా గత కొన్ని సంవత్పరాలుగా అక్కడక్కడ ఇది వెలుగు చూస్తోంది. ర్యాంగింగ్ రెండు రకాలుగా ఉంటుంది. విద్యాలయం లోపల జరిగేది ఒకటి అయితే కాలేజి ఆవరణలో జరిగేది మరో రకం. ఈ రెండింటినీ చట్టప్రకారం నిషేధించడం జరిగింది. ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తికి కనీసం ఆరు నెలల శిక్ష పడుతుంది. తీవ్రతను బట్టి  శిక్ష పెరిగే అవకాశం కూడా ఉంది.

ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను కాలేజి యాజమాన్యాలు బహిష్కరించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడే ముందు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ర్యాగింగ్ ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజి స్థాయిలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సీనియర్ విద్యార్థులు జూనియర్లు, ఫ్రెషర్స్‌పై ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటనలు గతంలో చాలా జరిగాయి. దీంతో చాలా కాలేజిలు యాంటీ ర్యాగింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశాయి. అంతేకాదు ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలి. 

కిరణ్ ఫిషర్, హైదరాబాద్