21-06-2024 12:00:00 AM
ప్రజలకు అన్యాయం జరిగితే ఆదుకోవలసిన రక్షక భటులే అన్యాయాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి, కాళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ తన కింద పని చేసే మహిళా కానిస్టేబుల్‌ను సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు పత్రికల్లో వార్త చూసి నివ్వెర పోవలసి వస్తోంది.ఆ ఎస్‌ఐపై ఇంతకు ముందు కూడా మహిళలను వేధించిన ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై ఓ సారి సస్పెండ్ కూడా అయినట్లు చెబుతున్నారు. తాను గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాననే ధ్యాసే లేకుండా ఇలాంటి ఘోరానికి పాల్పడి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇలాంటి వాళ్లు పోలీసు శాఖకే కళంకం.
కృష్ణకాంత్, ఘట్‌కేసర్