16-11-2025 12:51:18 AM
కాంగ్రెస్ నేతలకు పార్టీ అగ్రనేత అభినందన
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన తెలంగాణ నేతలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం, విజయం సాధించడం గురించి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లో గెలుపొందిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కష్టపడిన నాయకులను అభినందించారు. సమావేశంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం, రాష్ర్టంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.