calender_icon.png 16 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి

16-11-2025 12:52:35 AM

  1. ప్రత్యక్షమైన బెట్టింగ్ సైట్ 

షాక్‌కు గురైన న్యాయవాదులు, సిబ్బంది

సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారుల ఫిర్యాదు  

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురవడం తీవ్ర సంచలనం కలిగించింది. కొందరు వినియోగదారులు ఆర్డర్ కాపీలు, కేసుల వివరాల కోసం సైట్‌ను యాక్సెస్ చేయగా, అది అకస్మాత్తుగా ఆగిపోయి వెంట నే హైకోర్టు వెబ్‌సైట్ స్థానంలో ఓ బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదు లు.. బీడీజీ ఎస్‌ఎల్‌ఓటీ అనే బెట్టింగ్ సైట్ తెరుచుకుంది.

దీంతో సిబ్బంది, న్యాయవాదులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విష యాన్ని గుర్తించిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రా ర్, సిబ్బంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హ్యాకింగ్ వెనుక ఎవరున్నారు? హ్యాకర్లు సర్వర్లోకి ఎలా యాక్సెస్ సంపాదించారు? సర్వర్ భద్రతలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

కాగా హైకోర్టు వెబ్‌సైట్ సేవలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేసుకోవడంలో, కేసుల వివరాలు తెలుసుకోవడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం టెక్నికల్ బృందాలు వెబ్‌సైట్ భద్రతను బలోపే తం చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. న్యాయవ్యవస్థకు సంబంధించిన కీలక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కి గురవడం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది.