calender_icon.png 25 August, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీచక టీచర్ రాజేందర్ పై క్రిమినల్ కేసు నమోదు

24-08-2025 06:44:42 PM

రేగొండ,(విజయక్రాంతి): విద్యార్థుల త్రాగునీటిలో పురుగుల మందు కలిపిన భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల సైన్స్ టీచర్ పెండ్యాల రాజేందర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సైన్స్ టీచర్ రాజేందర్ పై భూపాలపల్లి మండల విద్యాధికారి అజ్మీర దేవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సైన్స్ టీచర్ పెండ్యాల రాజేందర్ ప్రత్యేక అధికారితో వ్యక్తి గత విభేదాల కారణంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని హానికర చర్యలకు పాల్పడినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని కలెక్టర్ తెలిపారు.

రెసిడెన్షియల్ ప్రత్యేక అధికారి వెంకట నరసయ్యపై వ్యక్తిగత విభేదాల కారణంగా సైన్స్ టీచర్ రాజేందర్ పాఠశాల ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.కుట్రలో భాగంగా గురువారం అర్ధరాత్రి సమయంలో తాగునీటి ట్యాంకులో హానికరమైన పురుగుమందు కలిపినట్లు విద్యార్థులు గమనించారని అన్నారు.

గమనించని 11 మంది విద్యార్థులు ఆ నీటిని తాగి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భూపాలపల్లి లో చికిత్స పొందుతున్నారని ఈ ఘటన పై తక్షణమే స్పందించిన జిల్లా విద్యా అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని సైన్స్ టీచర్ రాజేందర్ పై  క్రైమ్ నెంబర్ (467/2025 యు/ఎస్ 109 బిఎన్ఎస్ ) అటెంప్ట్ టు మర్డర్ కేసును భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.