24-08-2025 06:49:08 PM
మంత్రి సీతక్కతో మీడియా ముందు హాజరు
ధర్మపురి,(విజయక్రాంతి): ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయానికి జగిత్యాల జిల్లా టి.జె.ఎస్. నేతలు ఆదివారం నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ముఖ్దూం భవన్ లో ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయం వద్దకు తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ లతో పాటు జగిత్యాల జిల్లా టిజెఎస్ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు జిల్లపెల్లి దిలీప్ తదితరులు వెళ్ళారు. సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, హక్కుల నేతలు హర గోపాల్, కోదండరాం లతో కలిసి మీడియా ముందు హాజరయ్యారు.