calender_icon.png 25 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి వేడుకలు

24-08-2025 06:26:07 PM

ఆలయ ఫౌండర్ చైర్మన్ పోలావాణి కోటేశ్వర రావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను పురస్కరించుకొని హైదరాబాదులోని చందానగర్ ఆలయంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆలయ ఫౌండర్ చైర్మన్ పోలా. వాణి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు రెండు వందల మంది భక్తులు కుంకుమార్చన వాసవి మాత పారాయణం చేశారు. మూడు వందల మంది పైన శ్రీ వాసవి మాత దర్శనం చేసుకున్నారు. వీరికి చైర్మన్ అల్పాహారం మరియు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసే 145 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.