24-08-2025 06:55:09 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని అకెనపల్లి శివారు లో గల సర్వే నంబర్ 3/పైకి లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులకు వెంటనే వాటిని ఖాళీ చేయాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి నోటీసులు జారీ చేశారు.3/పైకి సర్వే నంబర్ లో ఉన్న 2.75 సెంట్ల భూమి కోర్టు కేసులో కొనసాగుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
అనధికారికంగా ఆక్రమించిన ఈ భూమిలో చేపట్టిన ఇళ్ళతో పలు నిర్మాణాలను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ఆదేశించారు. 3 రోజుల గడువులోగా ఖాళీ చేయకపోతే కోర్టు ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ, పంచాయితీ, విద్యుత్తు శాఖల అధికారుల సహాయంతో నిర్మాణదారుల స్వంత ఖర్చులతో బలవంతంగా ఖాళీ చేయించడం జరుగుతుందని నోటీసులో పేర్కొన్నారు.