calender_icon.png 25 August, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన డబుల్ బెడ్ రూములు

24-08-2025 06:51:55 PM

నిరుపేదలకు డబుల్ బెడ్రూంలో ఇవ్వాలి: బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు

హుజురాబాద్,(విజయక్రాంతి): అసాంఘిక కార్యకలాపాలకు అండగా మారుతున్న డబుల్ బెడ్ రూమ్ లను నిరుపేదలకు ఇవ్వాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో పాత శిశు మందిర్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ శివారులోని గణేష్ నగర్ లో  ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూంలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. 

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి అన్నారు. వాటిని రిపేర్ చేయించి జాగా, ఇల్లు లేని వారికి అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పుకుంటూ పేద ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటుందే తప్ప వారికి సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందన్నారు. వెంటనే అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్లో అందించాలని లేనిపక్షంలో బిజెపి తరఫున పేద ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.