calender_icon.png 11 July, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2025 12:07:48 AM

జగిత్యాల అర్బన్, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువా రం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ ఆశా జ్యోతి రాహుల్ గాంధీ అని అన్నారు.

త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకుడు ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా దేశం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండ గడుతూ ప్రజల పక్షాన ఉంటున్నారని కొ నియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో...మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, దుర్గయ్య, గాజుల రా జేందర్, కొత్త మోహన్ తదితరులుపాల్గొన్నారు.