16 April, 2026 | 7:26 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2025 01:00 AM

గజ్వేల్, జూన్ 19 :   లోక్ సభ ప్రతిపక్ష  కాంగ్రెస్ ముఖ్య నాయకులు  రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ లో ఘనంగా నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు  తూంకుంట నర్సారెడ్డి  ఆధ్వర్యంలో  గజ్వేల్  ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, ఇందిరాపార్క్ చౌరస్తాలో కేక్ కటింగ్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పెన్లు పంచడం జరిగింది. కార్యక్రమంలో గజ్వేల్, వంటిమామిడి, కొండపాక ఏఎంసీ చైర్మన్లు, నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

చేగుంటలో

చేగుంట, జూన్ 19 : చేగుంట పట్టణ లో గాంధీ చౌరస్తాలో దుబ్బాక అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సాముద్దీన్  ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సిద్ధం శశికాంత్, మండల అధ్యక్షులు  వడ్ల నవీన్ కుమార్ హాజరయ్యారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, వడియారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, అయిత పరంజ్యోతి, మండల యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు బోయిని శ్రీకాంత్, ముజామిల్, స్టాలిన్ నర్సులు, ఫకీర్ నాయక్, పుర్ర ఆగం, నదీమ్, నవీన్ నాయక్, జైల్ సింగ్ నాయక్, బాస రాజు నాయకులు పాల్గొన్నారు.