calender_icon.png 19 November, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

19-11-2025 07:57:06 PM

క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ సెంట్రల్ సెక్రటేరియట్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఆదేశించారు. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు, భూ సేకరణ, రైల్వే లైన్ పనులు, ఇతర అంశాలపై క్యాబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు  జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి బుధవారం హాజరయ్యారు.

కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ జిల్లాలో 40 కిలోమీటర్ల మేర ఉందని వివరించారు. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా భూసేకరణ, అటవీ శాఖ అనుమతి ఇతర పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్సలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ఇండస్ట్రీస్ జీఎం హనుమంతు, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.