22-05-2025 06:59:27 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): భూ భారతి సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. గురువారం లింగంపేట్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి సర్వే డెస్క్ పనులను ఆయన సబ్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ కింద మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
భూభారతి సదస్సులలో పలు సమస్యలకు సంబంధించి 4,225 దరఖాస్తులు రాగా సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 4100 దరఖాస్తులను సర్వే చేయడం జరిగిందని తెలిపారు. డెస్క్ వర్క్ ను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.