calender_icon.png 22 May, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ముప్పు నివారణకు చర్యలు

22-05-2025 06:50:38 PM

జిల్లా కలెక్టర్ అభిలాష వెల్లడి..

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వర్షాకాలంలో వరద ముంపు గురయ్యే ప్రాంతాల్లో నివారణ చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) వెల్లడించారు. ఇటీవలే ప్రభుత్వ ప్రత్యేక కమిషనర్ అరవింద్ కుమార్(Special Commissioner Arvind Kumar) జిల్లాను సందర్శించి పట్టణంలోని సిద్దాపూర్ జిఎన్ఆర్ కాలనీ వరద ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయడంతో నివారణ చర్యలను జిల్లా అధికారుల సమక్షంలో చేపట్టడం జరిగిందన్నారు.

వరద ముంపుకు ప్రధాన కారణం స్వర్ణ వాగుపై ఉన్న చెక్ డ్యాం అని భావించి దాన్ని ఎత్తు తగ్గించేందుకు అధికారులు పేలుడు పదార్థాలతో రంధ్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వరద ముప్పు ఏర్పడడంతో పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో నివారణ చర్యలు చేపట్టడం జరిగిందని ఆమె వివరించారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కూడా చైతన్యం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. చెక్ డ్యాం కు రంధ్రాలు ఏర్పరచడం వల్ల ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న నీరు కిందికి పోవడం వల్ల వరద నీరు ఎక్కువగా నిలిచే అవకాశం ఉండదని తెలిపారు.