calender_icon.png 22 May, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో మార్పుజరగాలి

22-05-2025 12:19:34 AM

  1. సీతారామ నీటి మల్లింపులో కొత్తగూడెం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి

పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని

పాల్వంచ మండలంలో రూ: 4.49 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. భద్రాద్రి కొత్తగూ డెం మే 21 (విజయ క్రాంతి) జిల్లా రైతాంగ సాగునీటి కష్టాలు తీర్చేవిధంగా, ఈ ప్రాంత రైతులకు ఈ జిల్లా నీటి వనరు ఉపయోగపడేలా సీతారామ ప్రాజెక్టు, కాల్వల నిర్మాణం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రభు త్వాన్ని కోరారు.

బుదవారం మండల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలు పరిధిలో 4.49 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మా ట్లాడుతూ నాటి పాలకులు అనాలోచిత నిర్ణయాలతో గోదావరి జలాలు ఈ జిల్లా ప్రజలకు అందకుండా పోయే ప్రమా దం ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సాగునీటిని అందించాలని, ప్రత్యేకంగా కొత్తగూడెం నియోజకవర్గానికి అధిక సాగునీటిని అందించాలన్నారు.

ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఈ జిల్లా రైతులకు నీరు అందించేందుకు కృషి జరుగుతుందన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా, పదికాలాలపాటు నిలిచివుండేలా చేపట్టాలని, అందుకు అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. నిర్మాణాల్లో లోపాలు జరిగితే ఉపేక్షించేదిలేదని హెచ్చ రించారు.  నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ దార ప్రసాద్, ఎంపీడీవో విజయ భా స్కర్ రెడ్డి, పంచాయతీరాజ్   రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి  సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వ నాథం, టీడీపీ రాష్ట్ర నాయకులు కనగాల అనంతరాములు, సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొండా వెంకన్న, బాలినేని నాగేశ్వరావు ఉపేందర్, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు వివిధ శాఖల అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.